కోటేశ్వరరావు. గుంటూరు.
గుంటూరులో న్యాయ–పోలీసు సమన్వయ నేర సమీక్ష సమావేశం గుంటూరు జిల్లాలో న్యాయవ్యవస్థ–పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు న్యాయమూర్తి శ్రీమతి కోలార్ లత అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నేర సమీక్ష సమావేశం.
నిర్వహించబడింది. ఈ సమావేశానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లంశెట్టి పవన్ కుమార్ డీఎస్పీ అరవింద్, మూడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIలు), ఏడు సబ్ ఇన్‌స్పెక్టర్లు (SIలు) సహా ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కోలార్ లత గారు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWలు) పై విస్తృతంగా చర్చించారు. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని, ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అలాగే ఇటీవల అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలు (BNSS)పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, చట్టపరమైన మార్పులను సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో APP గారు నిందితుల రిమాండ్ ప్రక్రియ, అరెస్ట్ కారణాలను నిందితులకు తెలియజేయడం యొక్క ప్రాధాన్యత, BNSS నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
అలాగే సుప్రీం కోర్టు తాజా తీర్పు “మెహిర్ రాజేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర” కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అరెస్ట్ మరియు రిమాండ్ సమయంలో పాటించాల్సిన న్యాయ సూత్రాలను వివరించారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
రాజీ సాధ్యమైన కేసులను గుర్తించి, లోక్ అదాలత్‌కు సిద్ధం చేయాలని పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా దర్యాప్తు సమయంలో చోటు చేసుకుంటున్న ప్రక్రియాపరమైన లోపాలు, విధానపరమైన లోపాలుపై చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశం ద్వారా న్యాయవ్యవస్థ మరియు పోలీసు శాఖల మధ్య సమన్వయం మరింత బలపడిందని, చట్ట అమలు మరింత సమర్థవంతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయ పడ్డారు.




