Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనవులూరు స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం |

నవులూరు స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం |

నవులూరు గ్రామంలోని స్మశాన వాటికలలో అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన నాయకులు*
స్మశాన వాటికలలో సొంత నిధులతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయించిన మంత్రి నారా లోకేష్*
మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ, ముస్లీం సోదరులు, మత పెద్దలు*

మంగళగిరి టౌన్: మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో మాదిగా, ముస్లీం స్మశాన వాటికలలో అభివృద్ధి చేయించిన పనులను టీడీపీ నాయకులు మత పెద్దలతో కలిసి శనివారం ప్రారంభించారు. స్మశాన వాటికలలో షెల్టర్, స్మశానం లోపల వరకు సీసీ రోడ్డు, నీటి సదుపాయం, సేద తీరడానికి సిమెంట్ బల్లలు, లైటింగ్, గోడలకు రంగులు, మరుగుదొడ్ల అన్ని హంగులతో నిర్మించారు. గ్రామంలోని మాదిగ, ముస్లీం స్మశాన వాటికలను అభివృద్ధి చేయించినందుకు దళిత, ముస్లీం సోదరులు, మత పెద్దలు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావులు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని ప్రతి స్మశాన వాటికను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎవరూ స్మశాన వాటికలను పట్టించుకోలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మంత్రి నారా లోకేష్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

అఖరి మజిలీలో వారికి కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా అంతిమ సంప్కారాలు నిర్వహించి గౌరవప్రదంగా సాగనంపాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ స్మశాన వాటికలను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు కొడాలి విజయ్, బేతపూడి సూరిబాబు, సంకటి దాసు, చెప్పరా సత్య ప్రకాష్ మల్లవరపు యేసు రత్నం.

ఆరుమళ్ళ లాబాను సుకుమార్, ఏవిఎస్ మణి, తిమోది, రవి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మీ,రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా(నులకపేట).

మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, మంగళగిరి మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ నజీర్, , గ్రామ పార్టీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిలకలపూడి శేషగిరి, వేమూరు బుజ్జిబాబు, తోట శ్రీనుబాబు, రుద్ర శ్రీనివాసరావు కొత్త శ్రీనివాసరావు,మహమ్మద్ జలాలుద్దీన్, బత్తుల నాగరాజు, మట్టుకోయే అశోక్, మట్టుకోయే శేషగిరి, షేక్ హనన్, షేక్ నాగుల్ మీరా, పఠాన్ అబ్ధుల్లా, షేక్ సుభాని(గల్ఫ్), షేక్ అన్వర్, షేక్ సమిరా, షేక్ ఖాజా, నవులూరు ఎస్సీ, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments