సికింద్రాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూర్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.
ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైల్వే ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా స్వగ్రామాలకు బయలుదేరారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు,మహిళలు,చిన్నారులు పండుగ జరుపుకునేందుకు పల్లెబాట పట్టారు.
#sidhumaroju
