ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం
*ఘనంగా నివాళులర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ నగర వడ్డెర సంఘం నాయకులు
విజయవాడ : తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు. బ్రిటీషు వారిపై ఓబన్న జరిపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం విజయవాడ నగర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వడ్డె ఓబన్న చిత్ర పటానికి ఎంపీ కేశినేని శివనాథ్,వడ్డెర సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రేనాటి వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్వసైనాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న బ్రిటీషర్లకు కంటికి కనుకు లేకుండా చేసిన మహోన్నత యోధుడు అంటూ కొనియాడారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్థాయిలో వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
టిడిపి బిసిల పక్షపాతి పార్టీ అని…బిసిలకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందన్నారు.సీఎం చంద్రబాబు నాయుడు వడ్డెరుల సంక్షేమానికి ఎన్నో విధాలుగా అండగా వున్నారని, వారి ఆర్థికాభివృద్ధి కోసం మైనింగ్ లో 15 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విజయవాడ నగర వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లేపు శ్రీరామ్ మాట్లాడుతూ వడ్డె ఓబన్న జయంతోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని…ఎన్డీయే కూటమి రావటంతో తమకు స్వర్ణయుగం వచ్చిందని తెలిపారు. తాము ఎప్పుడు తెలుగు దేశం పార్టీ అభ్యున్నతి కోసమే కష్టపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర వడ్డెర సంఘం గౌరవ అధ్యక్షుడు సూర కనకరావు, ఎన్టీఆర్ జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి దేవళ్ల శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహా చౌదరి, టిడిపి నాయకులు యెర్నేని వేదవ్యాస్, మాదిగాని గురునాథం, పీతా బుజ్జి, 51వ డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ కుంచం దుర్గారావు, విజయవాడ నగర వడ్డెర సంఘం కార్యనిర్వహక కార్యదర్శి కుంచం ప్రసాద్, విజయవాడ నగర వడ్డెర సంఘం మహిళ కన్వీనర్ వేముల దుర్గా, వడ్డెర సంఘం నాయకులు యు.శ్రీనివాసరావు, బత్తుల దుర్గారావు, కమిటీ సభ్యులు వల్లేపు వెంకటేశ్వరరావు, కుంచం బాలకృష్ణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




