Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు

కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు

కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో వరుసగా అపచారాలు – కామరాజ్ హరీష్

శ్రీ చక్ర నవార్చనలో ఎందుకు ఆవు పాలకు బదులుగా టెట్రా ప్యాకెట్లు తెచ్చారు- కామరాజ్ హరీష్
అమ్మవారి ఆలయ పవిత్రతను దిగజారుస్తున్న దుర్గగుడి అధికారులు – కామరాజ్ హరీష్
వరుస అపచారాలపై ఈవో సమాధానం చెప్పాలి – కామరాజ్ హరీష్
దేవాదాయ శాఖ కమిషనర్ గా ఐఏఎస్ ని నియమించాలి – కామరాజ్ హరీష్
దేవస్థానానికి టెట్రా ప్యాకెట్లు సప్లై చేసే కాంట్రాక్టర్ ఎవరు – కామరాజ్ హరీష్
ఆయనకి కమిషనర్ కి వున్నా సంబంధం ఏమిటి – కామరాజ్ హరీష్
దుర్గగుడిలో జరుగుతున్న వరుసపచారాలపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలి – కామరాజ్ హరీష్
దుర్గా ఘాట్లో జల్లు స్థానం తొలగించి నదీ స్థానం ఏర్పాటు చేయాలి – కామరాజ్ హరీష్

దుర్గగుడిలో వరసగా జరుగుతున్న అపచారాలపై స్పందిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక,విజయవాడలో పేరుగాంచినటువంటి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరుసగా అపచారాలు జరుగుతూ ఉన్నాయన్నారు.మొన్న అమ్మవారికి భవానీలు సమర్పించేటువంటి బంధాలల్లో ఈవో గారు,అదేవిధంగా పాలకమండలి చైర్మన్ గారు చేతులు పెట్టి దాంట్లో ఉన్న అమ్మవారికి సమర్పించేటువంటి పూజా సామాన్లు తీయడం బాధాకరం అన్నారు.

వెనువెంటనే మరి వేలాది లడ్డూలు మిగిలిపోయి ఆ లడ్డూల్ని భక్తులకు పంచుతున్నాం అని చెప్పే మరి ఆ లడ్డూలు కూడా బూజు పట్టేసినటువంటి పరిస్థితిని చూసాం అన్నారు.మరి నిన్నటి రోజున హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకునేటువంటి శ్రీ చక్ర నవార్చనకి వాడాల్సినటువంటి ఆవు పాలు టెట్రా ప్యాకెట్ తేవడమేంటని ప్రశ్నించారు.అమ్మవారి పవిత్రతను,అమ్మవారి యొక్క దేవస్థాన పవిత్రతను కాపాడాల్సినటువంటి ఈవో సీనా నాయక్ గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

వైదిక కమిటీ ఏం చేస్తుందన్నారు.టెట్రా ప్యాకెట్ ఆవు పాలు తేవడం వల్ల మరి అమ్మవారి శ్రీ చక్ర నవార్చన కార్యక్రమం కూడా ఒక అరగంట లేటుగా పూజా కార్యక్రమం ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా చూసామాన్నారు. మరి దేవాలయానికి టెట్రా ప్యాకెట్లు సప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు ఆయనకి దేవాలయ శాఖ కమిషనర్ కి ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలియపరచాలని డిమాండ్ చేశారు.వరుసగా అమ్మవారి దేవాలయంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.దేవాలయంలో ప్రసాదం కౌంటర్ వద్ద షాక్ కొడుతుందంటే మరి ఈవో గారు గాని అధికారులు గాని ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దేవస్థానంలో దీనిబట్టి అర్థమవుతా ఉందన్నారు.

ప్రసాదం కొనుక్కునే దగ్గరికి వెళ్తుంటే షాక్ కొడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తా ఉన్నామన్నారు.అంటే అమ్మవారి గుడికి వచ్చేటువంటి భక్తుల పట్ల గాని,అమ్మవారికి చేసేటువంటి పూజల పట్ల గాని ఈఓ గారికి బాధ్యత లేదన్నారు.ఎందుకని నిన్న శ్రీ చక్ర నవార్చనలో ఆవు పాలతో జరగాల్సినటువంటి అభిషేకానికి పాలు తేకుండా టెట్రా ప్యాకెట్ పాలు ఎందుకు తెచ్చారో దీని మీద ఆలయ ఈవో గారు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.మొన్న చూసాం అమ్మవారికి నివేదన సమయంలో మరి కరెంటు బిల్లు కట్టలేదని మరి గంటలపాటు కరెంటుని నిలిపి వేసినటువంటి సందర్భం చూసామన్నారు.

వరుసగా ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఈ వరుస కథనాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.అంటే అమ్మవారి మీద, అమ్మవారి పవిత్రతను కాపాడేటువంటి విధానం ఈఓ గారికి విలువ లేదన్నది అర్థమవుతుందన్నారు.కేవలం కాంట్రాక్టర్లకి కొమ్ము కాయడం కోసమే పని చేస్తున్నారన్నారు. మీకు సపోర్టుగా పాలకమండలి చైర్మన్ గారు పని చేస్తున్నారా అని ప్రశ్నించారు.వృధాగా లక్ష నుంచి లక్షా ఎనభై వేల రూపాయల వరకు కరెంటు బిల్లు కడుతూ దుర్గా ఘాట్ లో జల్లు స్నానాలు పెట్టారు.ఎంతోమంది భక్తులు అమ్మవారి గుడికి వచ్చిన వారు నదీ స్నానం చేసి అమ్మవారి గుడికి వద్దామనుకుంటూ ఉంటారు

.ఆ జల్లు స్నానాలు తీయండి మొర్రో అని చెప్పేసి ఎంతోమంది భక్తులు lదాని మీద మిమ్మల్ని విన్నవించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ జల్లు స్నానాలు అలా కొనసాగిస్తూనే ఉంటారు. అంటే అమ్మవారికి గుడికి వచ్చేటువంటి భక్తులకి నదీ స్నానం కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మరి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు పని చేస్తున్నారన్నారు.

అంటే హిందువులంటే ఈ కూటమి ప్రభుత్వంలో మీకు చులకనగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు.హిందూ దేవాలయాలపైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటువంటి ఇన్ని అపచారాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో ప్రభుత్వం పెద్దలు సమాధానం చెప్పాలన్నారు.దాని వెనక ఉన్నటువంటి దాగున్న రహస్యం ఏంటి తెలపాలన్నారు.ఇప్పటికి వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ పదవిని ఎందుకని ఒక ఐఏఎస్ ను కేటాయించలేకపోయారు అని ప్రశ్నించారు.

అంటే ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ల కొరత ఉందా అని ప్రశ్నించారు. ఒక నాన్ ఐఏఎస్ కేడర్ రామచంద్రమోహన్ గారిని మరి కమిషనర్ గా కొనసాగించడం వెనుక ఉన్నటువంటి దాగున్న రహస్యం ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.దేవాలయాల పైన,దేవాలయాల పరిరక్షణ గురించి మేము గళం విప్పుతూనే ఉంటాం అని తెలిపారు.అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను దిగజార్చవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments