దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే.
ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్* హాజరు.
కొత్తగా చేరిన విద్యార్థులకు అభినందనలు – మంచి డాక్టర్లుగా ఎదగాలని ఆకాంక్ష
విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు – సమాజ సేవ కోసం కూడా కావాలి
క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుత ప్రవర్తన అత్యవసరం.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. డ్రగ్స్ & మాదకద్రవ్యాలపై హెచ్చరికడ్రగ్స్ వ్యక్తిగత విషయం కాదు – దేశ భద్రతకు ముప్పు. గోల్డెన్ క్రెసెంట్ & గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నుంచి భారత్‌లోకి డ్రగ్స్ ప్రవేశం.
డ్రగ్స్ కొనుగోలు = ఉగ్రవాదానికి పరోక్ష ఆర్థిక సహాయం.
NDPS చట్టం ప్రకారం 10–20 సంవత్సరాలు జైలు + భారీ జరిమానాలు.
ఒకసారి అలవాటు అయితే భవిష్యత్తు నాశనం.
సైబర్ నేరాలపై అవగాహన దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్.
డిజిటల్ అరెస్ట్”, “సీబీఐ కాల్” వంటి మోసాలకు గురికాకండి.
మీ పెద్దవారికి అవగాహన కల్పించండి.
ప్రకాశం జిల్లా అద్దంకిలో రూ.1.15 కోట్లు మోసం ఉదాహరణ
సందేహాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
సోషల్ మీడియాలో చాటింగ్/వీడియోల వల్ల బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదం
ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవు.
యువతకు సూచనలు
స్ట్రెస్‌కు లోనవ్వకుండా లక్ష్యాలపై దృష్టి.
క్రీడలు, యోగా, ధ్యానం – సానుకూల మార్గాలు
స్నేహితుల ఒత్తిడికి లోనుకాకండి.
సమస్యలు ఉంటే తల్లిదండ్రులు – టీచర్లు – కౌన్సిలర్లతో మాట్లాడండి. భవిష్యత్ కార్యక్రమాలు
డ్రగ్స్, సైబర్ అవగాహన మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సిలబస్. రాష్ట్రవ్యాప్తంగా వందమంది విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు. 🔚 *చివరగా – బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్ష ఈగల్ ఆంధ్రప్రదేశ్
#కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.
