చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. చీరాల మండలం గవినివారిపాలెం గ్రామానికి చెందిన ఏలిక బాలకృష్ణ వరదరాజులు అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆధ్వర్యంలో గవినివారిపాలెం కు చెందిన యువతతో పాటు ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు సూమారు 800 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
వీరికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య టిడిపి పార్టీ కండవలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల ఆకర్షితులైన యువత టీడీపీ పార్టీ లోకి చేరడం చాలా సంతోషమని,సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతానని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తెలిపారు.
#Narendra
