చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
చీరాల: చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వెలుగు అధికారులు. మన సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో ఆవరణమంతా ఒక మినీ పల్లెటూరును తలపించింది.
అంబరాన్ని తాకిన ఈ సంబరాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను, రైతన్న పడే కష్టాన్ని మరియు ప్రకృతి పట్ల మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శనల ద్వారా వివరించారు. ముఖ్యంగా ముగ్గులు, గాలిపటాల పోటీలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. యాంత్రికంగా సాగిపోతున్న నేటి జీవనశైలిలో పండుగ వాతావరణాన్ని, సామూహిక వేడుకల గొప్పతనాన్ని పరిచయం చేయడం గొప్ప విషయం.
#Narendra




