Home South Zone Telangana పేకాట కోడిపందాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ |

పేకాట కోడిపందాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ |

0

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని అన్నారు

.అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు రాత్రి–పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిపారు.

పేకాట కోడిపందాలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

NO COMMENTS

Exit mobile version