Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు*
క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే…
మున్సిపల్ కమిషనర్.. ఎమ్మెల్యే రాము టీం సభ్యుల మధ్య… ఉత్సాహభరితంగా జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
సమర్థవంతులు ఉంటే అభివృద్ధి జరుగుతుందనడానికి….మున్సిపల్ అధికారులే నిదర్శనం

గుడివాడ జనవరి10: గుడివాడ ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో అందరం కలిసి గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని ఆయన పిలుపునిచ్చారు.

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు మరియు సచివాలయ సిబ్బంది వివిధ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు పోటీల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… వివిధ క్రీడా పోటీల్లో స్వయంగా పాల్గొని ఉద్యోగులను ఉత్సాహపరిచారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ టీం సభ్యులతో కలిసి… ఎమ్మెల్యే రాము టీం సభ్యులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు.

అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన సాంప్రదాయ క్రీడా పోటీలు, ప్రత్యేక విభాగాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులను అందించారు .

ముందుగా జరిగిన సంబరాల ముగింపు సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…ఉద్యోగుల్లో ఇంత టాలెంట్ ఉందా అని ఈరోజు ప్రత్యక్షంగా చూశారన్నారు. ఉద్యోగులందరూ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం హర్షనీయమన్నారు.

గుడివాడ అభివృద్ధి కోసం ఇదే ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. అధికారులు ఉద్యోగులు, తాము అందరం కలిసి పనిచేస్తే ఎంత అభివృద్ధి సాధించుకోవచ్చో గుడివాడలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.

అందరిని సమన్వయం చేస్తూ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న కమిషనర్ మనోహర్ ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అభినందించారు. అంతరం కలిసి కొత్త ఏడాదిలో మరింత అభివృద్ధి సాధించుకుందామని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య , చేకూరు జగన్మోహన రావు, కడియాల గణేష్, మున్సిపల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments