మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు
గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న పాత నేరస్తులు, అనుమానితులపై పటిస్ట నిఘా పెట్టి, గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించడం జరుగుతుంది
గుంటూరు పశ్చిమ DSP గారైన శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం ఇన్స్పెక్టర్ వై. సత్యనారాయణ గారు గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయడమైనది
గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడచిన మూడు నెలల కాలంలో 282 మందిపై 46 కేసులు నమోదు చేసి, 217 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.ఈ కేసుల్లో 78 కేజీల గంజాయిని, 250 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 34 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం సీజ్ చేయడం జరిగింది.
ఇప్పటివరకు 07 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా, 14 మందిపై PIT NDPS చట్టం ప్రయోగించడానికి సిఫార్సు చేయడం జరిగింది.




