Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneTelanganaరెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా

రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా

రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి వసంత రెడ్డికే దక్కనుందా

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వసంత రెడ్డి

భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 10:-

కోడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన వసంత రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమములో పాల్గొన్నది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఉమ్మడి పాలమూరు జిల్లా జాగృతి అధ్యక్షురాలుగా వసంత రెడ్డి ఎన్నో సేవ కార్యక్రమలు చేసింది.

కానీ మన ప్రాంతం బిడ్డ మన కోడంగల్ నియోజకవర్గం అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు వున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అపారమైన గౌరవం ఆప్యాయత అభిమానం వున్నా వసంత రెడ్డి జాగృతి సమావేశాలలో ఎక్కడ మాట్లాడిన మన పాలమూరు పులిబిడ్డలు అంటే కేవలం రేవంత్ రెడ్డి,డీకే అరుణమ్మ అని మాట్లాడేది తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఎన్నిసార్లు వారించిన కవితను ఎదిరించి మాట్లాడేది.

చివరకు కేవలం రేవంత్ రెడ్డి కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా జాగృతి అధ్యక్ష పదవి వదులుకొని మన ప్రాంతం బిడ్డ రాష్ట్రా ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి కోసం పని చేసింది గత పది సంవత్సరాలనుండి ప్రస్తుతం వసంత రెడ్డి రెడ్డి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్గ కొనసాగుతున్నారు.నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వసంత రెడ్డికి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెపొచ్చు.ఆమె గత పది సంవత్సరాల నుండి రెడ్ల హక్కుల కోసం ఈ డబ్ల్యూ ఎస్ విదేశీ విద్య కోసం పేదరెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ గురించి కుటుంబాన్ని సైతం వదిలి గత పది సంవత్సరాల నుండి రెడ్ల కోసం బడుగు బలహీన వర్గాల బీద ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

ఒకవైపు రెడ్లను ఐక్యమతం చేస్తూ రెడ్డి సంఘాలు సమావేశాలు పెట్టీ సంఘిటతం చేస్తూ తన జీవితాన్ని రెడ్డి జాతి కోసం బడిగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితం అంకితం చేస్తున్నారు. రెడ్ల జాతి అభివృద్ధి కోసం పనిచేస్తున్న వసంత రెడ్డికే రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనున్నట్లు రాష్ట్రంలోని రెడ్డి సంఘాల్లో చర్చి నడుస్తుంది.

తెలంగాణలో మహిళలకు పెద్ద పీట వేయాలని కోటి మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలోచన కావున పార్టీ కోసం ప్రజల కోసం కస్టపడి పని చేసిన వారికీ తప్పకుండ తగిన గుర్తింపు లభిస్తుంది తమ నాయకుడు తప్పకుండ గుర్తిస్తాడు అని పదవుల కోసం ఎదిరిచూస్తున్న నాయకులు కార్యకర్తలు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments