Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra PradeshKL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల

KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల

కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.*
ఆడపిల్లకు చదువే అసలైన ఆస్థి…
రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత..

ఆడపిల్లకు చదువే అసలైన ఆస్థి అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె మాట్లాడుతూ కెఎల్ యూనివర్శిటీలో అడుగు పెట్టగానే రాభోయే తరాన్ని తయారు చేసే ఖర్మాగారంలో అడుగు పెట్టినట్లుగా భావన కలిగిందన్నారు.

ఇంత మంది అమ్మాయిలను ఒక దగ్గర చూడటం ఆనందంగా ఉందన్నారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతున్న కెఎల్ యూనివర్శిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి తనకు చదువే అసలైన ఆస్థి అని చెప్కప్పారని తన భాల్యంలోని సందర్బాన్ని గుర్తు చేసుకున్నారు. తాను డిఎస్సి పాసయి ప్రభుత్వ ఉపాద్యాయినిగా పనిచేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడి ప్రోత్సాహంతో తాను రాజకీయాలలోకి ప్రవేశించి రాష్ట్రానికి హోం మంత్రి అయ్యానని చెప్పారు.

మోటివేషన్ అనేది ఆడపిల్లకి ఎంత ముఖ్యమో…. మగ పిల్లలకి కూడా అంతే ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలు ఎప్పటికీ మరచిపోకూడదని హితవు పలికారు. టెక్నాలజీలో కూడా కెఎల్ యూనివర్సిటీలో చదువుతున్న బాలికా విధ్యార్ధినులు ముందుండి శాటిలైట్ ప్రయోగాలు చేయడం ఆనందంగా ఉందన్నారు.

బాలికలు అపరిచితుల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను ఆమె ఉదహరించారు. ఇన్ స్టా గ్రామ్ , ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా పరిచయాలను నమ్ముకుని కన్న వారికి కడుపుకోత మిగల్చవద్దని తెలియజేశారు. తాను హో మంత్రిగా భాధ్యతలు తీసుకున్న ఏడాదిన్నర కాలంలో 4 శాతం నేరాల శాతం రాష్ట్రంలో తగ్గిందన్నారు.

సోషల్ మీడియా వచ్చాక బాలికలను ట్రాప్ చేసే ఆకతాయిలు ఎక్కువయ్యారని అన్నారు. అలాంటి వారి పట్ల బాలికలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 18 ఏళ్ళ లోపు బాలికలను వేధించినా , అసభ్య కరంగా ప్రవర్తించిన వారిపైన పోక్సో కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీ షీట్లు నిమోదు చేయస్తామని హెచ్చరించారు. మీ చుట్టు పక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈగల్ టీమ్ కు సమాచారం ఇవ్వాలని కోరారు..

వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఒక దశలో తాను కూడా సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యానట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రోత్సాహంతో తాను రాజకీయాలలో విజయం సాదించానట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమె కెఎల్ యులో పిబ్రవరి మాసంలో జరగనున్న ఫెమ్ ప్లేర్ పోస్టర్ ను ఆవిష్కరించారు..

ఈ సందర్బంగా కెఎల్ యు కార్యదర్శి కోనేరు శివకాంచనలత మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహంచే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు.

కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని చెప్పారు.

యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ జి.పార్ధసారధివర్మ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండవ విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందలేని విద్యార్థులు రెండవ విడత నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కెఎల్ ట్రిపుల్ ఈ కన్వీనర్ డాక్టర్ ఎం.సుమన్, హెంహెచ్ఎస్.డీన్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు, విద్యార్ధి సంక్షేమ విబాగం ఇంచార్జి డీన్ డాక్టర్ కెఆర్.ఎస్.ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments