చింతామోహన్,
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్.
దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
జగన్ కూడా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను కూడా ఒక బిలీనియర్.
చంద్రబాబు, జగన్ ఇద్దరు బిలినియర్ల చేతిలో రాష్ట్ర రాజకీయాలు బ్రష్టు పట్టి పోతోంది.
బిజెపి, వైసిపి, టిడిపి త్రీ ఇన్ వన్ పార్టీలు.
కాంగ్రెస్ తెచ్చిన పథకాలను, విజయాలను వైయస్ కుటుంబం తన ఖాతాలో వేసుకుంది.
రాష్ట్ర రాజకీయాలు దిన దినానికి బాగా బ్రష్టు పట్టి పోతోంది. బిలీనియర్లు రాజకీయాలు చేస్తున్నారు.
బిజెపి, వైసిపి, టిడిపి మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి ఢిల్లీలో. ఆ మూడు పార్టీలు త్రీ ఇన్ వన్ పార్టీలు.
జగన్ బటన్ నొక్కడం తప్ప, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశారు?
చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉత్తుత్తి మాటలు, ఉపన్యాసాలు తప్ప, ఆయన ఏమీ సాధించలేకపోయారు.
దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలో, సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
జగన్ కూడా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఒక బిలినియరే.
జగన్, చంద్రబాబు ఇద్దరు బిలినియర్లు మధ్య రాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పడిపోతావుంది.
మోడీ గారికి, చంద్రబాబు, జగన్ ఇద్దరూ విధేయులుగా ఉంటున్నారు. కేసులు తప్పించుకోవడానికి జగన్, నిధులు కోసం చంద్రబాబు నాయుడు.
అమిత్ షా ఇంట్లో అర్ధరాత్రి, ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. ఆంధ్రుల ఆత్మగౌరవం బలహీనమైంది.
విశాఖ ఉక్కు.
************
రాజమండ్రి సభలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయోజనాలను కాపాడలేకపోయారు.
మూడు నెలల క్రితం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, లేకుంటే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నేను కోరాను.
ప్రైవేటీకరణ జరపబోమని, కేంద్ర క్యాబినెట్ నుంచి ప్రకటన రాలేదు. ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు రాలేదు.
ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగుల నుంచి బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు.
జగన్, చంద్రబాబు ఇద్దరూ ప్రధాని గారితో దగ్గరగా ఉన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రయోజనాలను కాపాడలేక పోయారు.
కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడగలుగుతుంది. సంక్షోభం నుంచి బయటకు తేగలుగుతుంది.
ఉపాధి హామీ చట్టం.
ఉపాధి హామీ చట్టం, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు ఎక్కడ పుట్టిందో చాలామందికి తెలియదు.
కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారి హృదయంలో నుంచి ఉపాధి హామీ చట్టం పుట్టింది.
కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు గొప్ప దేశభక్తుడు. బ్రిటిష్ డౌన్ డౌన్ అన్నందుకు పెళ్లి పీటలు నుంచే, ఆయన్ను అరెస్టు చేశారు. లాహోర్ జైల్లో, అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు. ఆరు నెలలు సూర్యున్ని చూడలేదు హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు.
2004లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు జతకట్టిన తరువాత, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు, ప్రకాష్ కారత్ గారు కోరారు. సోనియా గాంధీ గారు అంగీకరించారు.
రైతు కూలీల వ్యక్తిత్వాన్ని నిలబెట్టేదాని కొరకు, ఉపాధి హామీ చట్టం యూపీఏ ప్రభుత్వం తెచ్చింది.
మళ్లీ భూస్వాముల కాళ్ళ కింద రైతు కూలీలను బానిసలుగా చేసేందుకు, బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసింది.
మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్య్రం తేవడమే కాదు, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధి హామీ చట్టంలో తీసివేయడం దుర్మార్గం, దౌర్భాగ్యం. బిజెపి వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఎస్సీలు, ఓబీసీలు.
ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎస్సీలను ఆర్థికంగా పైకి తేవడానికి, ఇందిరా గాంధీ గారు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.
జగన్, చంద్రబాబు పాలనలో ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు. కార్పొరేషన్లను మూసేశారు.
ఏపీలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. M.com చదువుకున్న నిరుద్యోగులు హోటళ్లలో టీలు సప్లై చేస్తున్నారు.
M.tech పాసైన వారు సచివాలయాల్లో 32 వేల రూపాయిలు జీతానికి పనిచేస్తున్నారు. కష్ట, కష్టాలు పడుతున్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసేందుకు, పేద, మధ్యతరగతి కుటుంబాలలో వెలుగులు తెచ్చేందుకు, ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలు, సాధించిన విజయాలను వైయస్ కుటుంబం తన ఖాతాలో వేసుకుంది.
యూపీఏ ప్రభుత్వం ఎక్కడ ఫామ్ అయ్యిందో, భారతదేశంలో చాలామందికి తెలియదు. ప్రస్తుతానికి ఆ విషయాన్ని నేను వెళ్లడించలేను.
సమాచార హక్కు చట్టం, నిర్బంధ విద్యాహక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో గొప్ప మంచి పనులను కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం చేసిందని చింతామోహన్ తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ డిసిసి అధ్యక్షులు సూర్యారావు, అబిదా పాల్గొన్నారు.




