కర్నూలు : నంద్యాల : డోన్
డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్ పగిలి నీరు ఎగసిపడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
విలువైన నీరు వృథాగా పోతున్న అంశాన్ని గమనించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టి నీటి లీకేజీని అడ్డుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఎమ్మెల్యే గారు సూచించారు.




