బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
బాపట్ల జిల్లా,చీరాల :బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
బాపట్ల జిల్లా చీరాల రూరల్ ఎస్.ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బంది తో కలిసి చీరాల రూరల్ స్టేషన్ పరిధిలో బుర్లవారిపాలెం గ్రామం అటవీ ప్రాంతంలో కోడి పందేలు ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు.
కోడి పందేలు స్థావరం పై నిర్వహించిన దాడిలో ముగురుని అదుపులోకి తీసుకుని, ఒక పందెపు కోడిని, రూ.500/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పేకాట, కోడి పందాలు ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
#Narendra




