తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/- నగదు దోచుకున్న నిందితులు జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాలతో చాకచక్యంగా కేసును ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీసులు
చీరాల: తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/- నగదు దోచుకున్న నిందితులు జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాలతో చాకచక్యంగా కేసును ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీసులు
7 గురు నిందితులు అరెస్ట్, రూ.4,00,000/- నగదు స్వాధీనం
వెదుళ్ళపల్లి పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ గారు.
కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన బాపట్ల డిఎస్పీ జి.రామాంజనేయులు గారు
Cr.No: 02/2026 U/S 319(2), 318(4) r/w 3(5) BNS OF VEDULLAPALLI P.S
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, స్టువర్టుపురం రెండో గ్యాంగ్‌కు చెందిన అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠా తక్కువ ధరకు బంగారం అమ్ముతామని నమ్మించి, పోలీసుల వేషధారణలో వచ్చి బాధితురాలిని మోసం చేసిన ఘటనలో, వెదుళ్ళపల్లి ఎస్‌ఐ పి. భాగ్యరాజ్ తమ సిబ్బందితో కలిసి ది:11.01.2026 సాయంత్రం 6.00 గంటలకు చీరాల మండలం తోటవారి పాలెం పోలేరమ్మ గుడి రోడ్డులో నిందితులను అరెస్టు చేశారు.
సోమవారం వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ జి.రామాంజనేయులు గారు కేసు వివరాలను వెల్లడించారు.
నేరం జరిగిన విధానం:
తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలం, పందూరు గ్రామానికి చెందిన మోగిలిశెట్టి శ్రీదేవి @ దేవి అనే మహిళను, స్టూవర్ట్‌పురం రెండో గ్యాంగ్‌కు చెందిన లక్ష్మి @ పీరిగ కళ్యాణి, తన బావ అంగడి చంద్రబాబు, అక్క ప్రసన్న కుమారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నారని, ఆ బంగారాన్ని విడిపించుకొని లాభం పొందవచ్చని గత మూడు నెలలుగా మోసపూరిత మాయా మాటలతో నమ్మించింది.
వారి మాటలు నిజమని నమ్మిన ఫిర్యాది ది:06.01.2026న తన డ్రైవర్ విజయ్‌తో కలిసి పందూరు గ్రామం నుంచి స్టూవర్ట్‌పురం గ్రామానికి వచ్చారు. ముందుగా రూపొందించుకున్న పథకం ప్రకారం, లక్ష్మి @ పీరిగ కళ్యాణి, అంగడి చంద్రబాబు @ చంద్ర, అంగడి ప్రసన్న కుమారి @ అమ్ములు, అంగడి లోహిత్, చిన్నబోతుల భవాని శంకర్ @ సన్నీ, మాదిగాని రామచంద్ర కుమార్ @ పెద్ద పప్పు, అంగడి కావేరి @ దీప్తి, చిట్టి బాబు @ గురవయ్య, కొండేటి హరికృష్ణ మరియు పీరిగ సందీప్ @ నాని కలిసి, పోలీసు వేషధారణలో వచ్చి తమను పోలీసులమని పరిచయం చేసుకుని, “దొంగ బంగారం కొనడానికి వచ్చావా?” అంటూ బెదిరించి ఫిర్యాది వద్ద ఉన్న రూ.6,50,000/- నగదును తీసుకుని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు Cr.No: 02/2026 U/S 319(2), 318(4) r/w 3(5) BNS గా వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెయ్యడం జరిగింది.
దర్యాప్తు సాగిన విధానం:
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. హరికృష్ణ పర్యవేక్షణలో, వెదుళ్ళపల్లి ఎస్‌ఐ పి.భాగ్యరాజ్ తమ సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దర్యాప్తు నిర్వహించారు. నిందితులు ది:11.01.2026 న చీరాల మండలం తోటవారి పాలెం పోలేరమ్మ గుడి రోడ్డులో, ఛీటింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పార్టీ చేసుకుంటున్నారనే కచ్చితమైన సమాచారంతో వెదుళ్ళపల్లి ఎస్ఐ తన సిబ్బందితో ఆప్రదేశానికి చేరుకొని నేరానికి పాల్పడిన 7 గురు నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసినారు. వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వద్ద నుండి రూ.4,00,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గౌరవ AJCJ కోర్టులో హాజరుపరచనున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు:
1. లక్ష్మి @ పీరిగ కళ్యాణి – (A1)
2. అంగడి ప్రసన్న కుమారి @ అమ్ములు – (A2)
3. అంగడి చంద్రబాబు – (A3)
4. చిన్నబోతుల భవాని శంకర్ @ సన్నీ – (A6)
5. మాదిగాని రామచంద్ర కుమార్ @ పెద్ద పప్పు – (A7)
6. అంగడి కావేరి @ దీప్తి – (A8)
7. అంగడి లోహిత్ @ దీపు – (A9)
స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుల వద్ద నుండి రూ.4,00,000/- నగదు స్వాధీనం చేసుకొని కేసు సొత్తుగా సీజ్ చెయ్యడం జరిగింది.
పోలీసుల హెచ్చరిక:
ప్రజలు ఎవరైనా “తక్కువ ధరకు బంగారం అమ్ముతాము” “బ్యాంక్ ఆభరణాలు విడిపించుకోలేకపోతున్నాము” వంటి మాయా మాటలు నమ్మవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ లేదా సమాచారం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
#Narendra
