Home South Zone Andhra Pradesh బాపట్లలో ఫిబ్రవరిలో హౌస్‌బోటు సేవలు ప్రారంభం |

బాపట్లలో ఫిబ్రవరిలో హౌస్‌బోటు సేవలు ప్రారంభం |

0

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్

బాపట్ల : ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన సూర్యలంక ఆదర్శ నగర్ వంతెన నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు మోటారైజ్డ్ బోటులో ప్రయాణించి ప్రాంతంలోని పేరాలి డ్రెయిన్, పొగరు, హార్బర్ పరిసరాలను పరిశీలించారు.
పర్యాటక, పంచాయతీరాజ్, అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు కలసి నిర్వహించిన ఫీల్డ్ సర్వేలో పర్యాటక మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.
పొగరు వద్ద వాక్‌వేలు ఏర్పాటు చేయాలని, ఆదర్శ నగర్ వద్ద జెట్టి నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు. ఆదర్శ నగర్ నుంచి నిజాంపట్నం వరకు కెనాల్ చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
ఫిబ్రవరిలో 6 బెడ్స్ సామర్థ్యం గల ఒక హౌస్‌బోటు, 2 బెడ్స్ సామర్థ్యం గల మరో హౌస్‌బోటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.
నిజాంపట్నం ప్రాంతాన్ని ఆక్వా టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
ఆదివారం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్‌ను ఆయన పరిశీలించారు.సముద్రం నుంచి వేట ముగించుకుని వచ్చిన మత్స్యకారులతో చేపల రకాలు, మార్కెటింగ్ విధానం, సముద్రంలో గడిపే రోజులు వంటి అంశాలపై కలెక్టర్ గారు చర్చించారు.
ప్రతిపాదిత ఆక్వా టూరిజం పార్క్‌ను వేగంగా పూర్తిచేసి, ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇది మేలు చేస్తుందని పేర్కొన్నారు.
బాపట్ల మండలం సూర్యాలంక ఆదర్శ నగర్ నుంచి నిజాంపట్నం వరకు మోటారైజ్డ్ బోటులో పర్యటిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు పెద్దపులుగువారిపాలెం వద్ద చేపల వేట సాగిస్తున్న తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీను – వెంకటేశ్వరమ్మ దంపతులను కలుసుకున్నారు.
వారి రోజువారి ఆదాయం, ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రుల్లో వైద్యం అందుతున్న తీరుపై ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా.. అంటూ ఆప్యాంగా పలకరించారు..
ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారికి సూచించారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version