గుంటూరు జిల్లా పోలీస్.
తాళం వేసి మూసివున్న ఇళ్ల భద్రత కోసం పోలీస్ వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాల(LHMS) సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు,./
తాళం వేసి మూసివున్న ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చి, యజమానులు తిరిగి వచ్చే వరకు పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు.
ఇళ్లలో ఏదైనా అనుమానాస్పద కదలికలు సంభవిస్తే వెంటనే స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాల వ్యవస్థ.
ఆ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో భద్రత బలోపేతం చేసి, నిరంతర గస్తీ నిర్వహణ.*ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకునే విధంగా ప్రణాళిక.*పోలీస్ వారు ఉచితంగా అందించే ఈ సీసీ కెమెరాలు(LHMS) సేవను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించిన జిల్లా ఎస్పీ గారు.*
సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులకు ప్రజలకు వివిధ ఊర్లకు ప్రయాణిస్తూ ఉంటారు.ఆ సమయంలో తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్తుంటారు అయిన కూడా కొన్ని సార్లు దొంగతనాలు వంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవచ్చు.ఇటువంటి వాటిని నిరోధించాలనే లక్ష్యంతో గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా తాళం వేసి ఉన్న ఇళ్ల భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో “Locked House Monitoring System” ను గుంటూరు జిల్లా పోలీస్ వారు అమలులోకి తీసుకువచ్చారు.
ఈ LHMS వ్యవస్థ తరపున అమర్చిచిన సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీస్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది.ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగ, వ్యాపార, వివాహాలు, పండుగలు లేదా ఇతర అవసరాల కారణంగా కొంతకాలం ఇంటిని తాళం వేసి వెళ్లే ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ విధానంలో భాగంగా:* * తాళం వేసి ఉన్న ఇళ్ల వివరాలను సంబంధిత యజమానులు అందించిన వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో నమోదు చేస్తారు. * గస్తీ(బీట్) పోలీస్‌లు, సీసీ కెమెరాలు మరియు నైట్ ప్యాట్రోలింగ్ ద్వారా ఆ ఇళ్లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే ఇళ్లలో అమర్చిన సీసీ కెమెరాలలోని సాంకేతిక పరిజ్ఞానం, ఆ విషయాన్ని కనిపెట్టి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందిస్తుంది. ఈ విధానం వల్ల:* * చోరీలు, అక్రమ ప్రవేశాలు నివారించబడతాయి. * ప్రజల ఆస్తులకు సంబంధించి పోలీస్ శాఖ పటిష్ట భద్రత కల్పించగలుగుతుంది. * నేరాల నివారణలో ప్రజలు,పోలీసుల మధ్య సమన్వయం బలోపేతమవుతుంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు ఈ Locked House Monitoring System ను వినియోగించుకొని తమ ఆస్తులను సురక్షితంగా కాపాడుకోవాలని కోరారు. అవసరమైన వివరాల కోసం సమీప పోలీస్ స్టేషన్‌ను గాని, డయల్ 112 అనే నంబర్ ద్వారా గానీ సంప్రదించాలని సూచించారు.
#kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.
