Home South Zone Andhra Pradesh గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.

గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.

0

మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ‘డిజి కమాండేషన్ కార్డ్’ అవార్డు లభించింది.

గత 16 ఏళ్లుగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఢిల్లీలోని ఎన్. సి. సి విభాగం ఈ అవార్డును ప్రకటించింది.

శనివారం చిత్తూరులోని 35వ ఆంధ్ర NCC బెటాలియన్ కార్యాలయంలో కల్నల్ NV మోనిస్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గిరిధర్ నాయక్ విజయం పట్ల MLA షాజహాన్ బాషా, ఉపాధ్యాయ సంఘాల నేతలు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version