Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneTelanganaయువతకు దిక్సూచి స్వామి వివేకానంద ప్రస్థానం . |

యువతకు దిక్సూచి స్వామి వివేకానంద ప్రస్థానం . |

హైదరాబాద్ : భారత్ అవాజ్.
నేడు స్వామి వివేకానంద 163 వ జయంతి.
🇮🇳 జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

ఆఖండ భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మిక మహోన్నతత్వాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా ప్రతిధ్వనింపజేసిన గొప్ప యోగి, మహా త్యాగశీలి స్వామి వివేకానంద .

తన సంపూర్ణ జీవితాన్ని దేశ హితం కోసం, ధర్మ పరిరక్షణ కోసం, యువత జాగరణ కోసం అంకితం చేసిన మహానుభావుడు.

“లేచి నిలబడండి – లక్ష్యం చేరేవరకు ఆగవద్దు” అనే ఆయన బోధ నేటికీ, రేపటికీ యువతకు మార్గదర్శక దీపంలా వెలుగుతోంది.

భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన ఆలోచనలు, ఆదర్శాలు యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావాన్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాయి.

ఈ పవిత్ర సందర్భంలో ఆ మహానీయుని స్మరిస్తూ ఆయన ఆశయాలను మన జీవితాల్లో అమలు చేయడమే మనమిచ్చే నిజమైన నివాళి.

ఆయన పిలుపు ఒక నిరంతర చైతన్యం.. ఆయన బాట ఒక అజేయ ప్రయాణం.
వివేకానందుని ..కలల భారం మన చేతుల్లోనే.
జయహో స్వామి వివేకానంద!
జయహో భారత యువశక్తి!

Sidhumaroju ✍️

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments