మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో రైతు వేదికలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన ఉత్సవ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన బోధనలు దార్శనికతను స్ఫూర్తిని నింపుకోవాలని అన్నారు.విద్యార్థి దశ నుండి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ పెరుగుతాయని కలెక్టర్ అన్నారు.
జాతీయ సమైక్యత,మత సామరస్యం,సోదరభావం వంటి వివేకానందుడి ఆశయాలను యువతలో ప్రచారం చేయాలన్నారు.
