మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ 296 డివిజన్ శంభీపూర్ లోని ఈరోజు స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12న జరుపుకునే స్వామి వివేకానంద జయంతి, ప్రభావవంతమైన మరియు తత్వవేత్త జన్మదినాన్ని పురస్కరించుకుని, యువతకు ఆత్మవిశ్వాసం, సేవ మరియు బలం అనే సందేశంతో స్ఫూర్తినిచ్చేందుకు ఆయన పుట్టినరోజును భారతదేశ జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటామని వేదాంతాన్ని మరియు యోగాను పరిచయం చేయడంలో ఆయన పాత్రను, ఆయన ప్రసిద్ధ చికాగో పార్లమెంట్ ప్రసంగాన్ని మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ మరియు సామాజిక సంక్షేమంపై దృష్టి సారించి రామకృష్ణ మిషన్ స్థాపనను గుర్తుచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమలేష్, శ్యామ్ రావు, ఉట్ల శ్రీహరి, శ్రీశైలం, మల్లేష్, బాలకృష్ణ, సుధాకర్, నర్సింగ్, వినోద్, కళ్యాణ్, అనిల్, సాయి, నవీన్, బబ్లూ, కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
