Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneTelanganaఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |

ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ :

సబ్ రిజిస్టార్ కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

ఈరోజు శుభకార్యం అయినా మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకువస్తున్న.

కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియా కాంక్రీట్ జంగల్ గా మారింది.
అత్యధిక జన సాంద్రత ఉన్న ప్రాంతం ఇది.
హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో మిగిలిన స్థలాలు అయితే కబ్జాకు గురవుతున్నాయి లేదంటే ప్రభుత్వమే వేలం పాట పెట్టీ అమ్ముతుంది. అలాచేయకుండా ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేదతీరేలాగా పార్క్ లుగా మార్చాలని కోరుతున్న.

నలభై యాభై ఏళ్ళ క్రితం ఏర్పడ్డ “లే అవుట్” లలో ఉన్న ఖాళీగా ఉన్న పార్క్ స్థలాలు, స్కూల్స్ స్థలాలు బై నంబర్స్ వేసి కబ్జా చేస్తున్నారు. అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించి వాటిని కాపాడాలని కోరుతున్నాను.

సివిల్ తగాదాలకు, భూ పంచాయతీలకు పోలీస్ స్టేషన్లు అడ్డాలుగా మారడం మంచిది కాదు. గొప్ప పేరున్న మన పోలీస్ కి ఇది మచ్చ తీసుకువస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పని చేయాలని కోరుతున్న. నా దృష్టిలో 50 అంశాలున్నాయి వాటిని మీకు పంపిస్తా. దొంగ డాక్యుమెంట్ సృష్టించి కోర్టులలో వేసి అధికారులను మేనేజ్ చేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారు. సామాన్యులకు ఈ పని చేసి పెడితే మంత్రిగారు మీకు మంచి పేరు వస్తుంది.

పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలి.

ఇలాంటి భూముల విషయంలో..
కమిటీ వేసి నిర్ణయం తీసుకోండి..
లేదంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి.

ప్రభుత్వం పేదలకు ఎప్పుడో ఏక్ సాల్ పట్టా అని ఇచ్చింది.. ఆ భూములు బ్రోకర్లు కబ్జా పెట్టారు. వీటి మీద కూడా దృష్టి పెటండి.
ఒకవేళ నిజమైన పేదలు ఆ భూమి మీద ఉంటే వారికి నష్టపరిహారం చెల్లించి భూములు సేకరించాలి తప్ప వారిని తరిమివేయవద్దు.

HMT, IDPL భూముల్లో 60 గజాల్లో పేదలు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టకండి. బడాబాబులు ఆక్రమిస్తే మాత్రం వెనక్కు తీసుకోవాలి.
పెదోళ్ళు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్ళు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేదు అనే భావన ప్రజల్లో వచ్చింది ఇది మంచిది కాదు.

ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్ళమని కోరుతున్న.. చాలా పెద్ద కంపెనీలు ప్రీ బుకింగ్ పేరుమీద వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయు. ఇలాంటి వాటివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటిమీద ఉక్కుపాదం పెట్టండి.

DSR కంపెనీ వారికి శుభాకాంక్షలు. CSR ఫండ్స్ తో ప్రజలకు సేవ చేయండి.
మంచి పేరు శాశ్వతంగా ఉంటుంది.

అన్ని పార్టీల వారిని పిలిచి అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి మంచి ప్రజాస్వామ్య వాతావరణం కల్పించినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments