నేడు మనందరి ప్రియతమ నాయకుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి.
వార్డుస్థాయి కమిటీలలో నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రీజినల్ కో ఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెదిరెడ్డి మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, అనంతపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పాల్గొని ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించి, పలు అంశాలు చర్చించి, పార్టీ మరింతబలోపేతం కోసం పలు అంశాలు సూచించి, దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, పీఏసీ సభ్యులు, సీఈసీ సభ్యులు, ఎస్ఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ అబ్జర్వర్లు, ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, ఉమ్మడి అనంతపురం జిల్లా అనుబంధం విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ ఆఫీస్ మేనేజర్లు.
మండలాల పార్టీ అధ్యక్షులు, డిజిటల్ మేనేజర్లు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
