Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshజాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో పాల్గొన్న డీఐజీ కర్నూలు ఇన్చార్జి ఎస్పి!!

జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో పాల్గొన్న డీఐజీ కర్నూలు ఇన్చార్జి ఎస్పి!!

కర్నూలు సిటీ : కర్నూలు
కర్నూలు జిల్లా…రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యం…. డిఐజి, కర్నూల్ జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు* జనవరి 31 వరకు 37 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు..* హెల్మెట్ ధరించి  బైక్ ర్యాలీ లో పాల్గొన్న…  డిఐజి, జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ.* హెల్మెట్ ధరించడం  పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.ఈ నెల 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా   మాసోత్సవాల సంధర్బంగా  సోమవారం కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజలకు రోడ్డు భధ్రత , ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు  కర్నూలు రవాణా శాఖా , కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్‌  అవగాహన  ర్యాలీ చేపట్టారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి  డిఐజి , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.  హెల్మెట్ అవగాహన ర్యాలీ  కార్యక్రమాన్ని  డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శ్రీమతి శాంత కుమారి గారు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ అవగాహన ర్యాలీ  జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్,  రాజ్ విహార్,కలెక్టరేట్ మీదుగా  సి. క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగాడిఐజి ,  కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు మీడియాతో మాట్లాడుతూ…. జనవరి 1 నుండి 31 వ వరకు 37 వ జాతీయ రహాదారి భద్రత మాసోత్సవాలను రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. ఈ రోజు కర్నూలు రవాణా  శాఖ , కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహనకు హెల్మెట్ ర్యాలీ  నిర్వహిస్తున్నారన్నారు. హెల్మెట్ ర్యాలీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

హెల్మెట్ ధరించే విధంగా నో హెల్మెట్ – నో పెట్రోల్ అని కూడా   పెట్రోల్ బంకుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి , మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. 60 నుండి 70 శాతం మరణాల్లో ద్విచక్ర వాహన బాధితులే ఎక్కువగా ఉన్నారన్నారు. హెల్మెట్లు ధరించి ప్రయాణం చేస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చన్నారు.జరిమానాలు విధిస్తారనే ది కాకుండా వ్యక్తిగత  భద్రత  , రక్షణ పరంగా  హెల్మెట్లు  భాధ్యతగా ధరిస్తే  ప్రాణ నష్టం అనేది ఉండదన్నారు.

మీ పై ఆధారపడిన కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. ప్రతి పౌరుడు తన భద్రతకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కర్నూల్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జీ &  సెక్రటరీ బి. లీలా వెంకట శేషాద్రి గారు మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ తమ భాధ్యతగా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు ఖచ్చితంగా తలకు  హెల్మెట్  ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలలో  ద్విచక్రవాహనదారులకు తలకు గాయాలు కావడం వలనే  ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయన్నారు.

తలకు హెల్మెట్ ధరించడం వలన మనకు రక్షణ గా ఉంటుందన్నారు. మనపై ఆధారపడిన కుటుంబాల గురించి ఆలోచించాలన్నారు. చట్ట ప్రకారం మరియు సామాజికంగా వ్యక్తిగత బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు.ఈ అవగాహన ర్యాలీలో  కర్నూల్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జీ &  సెక్రటరీ బి. లీలా వెంకట శేషాద్రి గారు,  డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శ్రీమతి శాంత కుమారి గారు ,  ఎఆర్ అడిషనల్ ఎస్పీ  కృష్ణమోహన్ , కర్నూలు  డిఎస్పీ బాబు ప్రసాద్ , ఆర్టీవో ఇన్ చార్జ్ మల్లికార్జున, సిఐలు మన్సురుద్దీన్, మధుసుధన్ రావు, పార్థసారథి.

ఆర్ ఐలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు,  ఆర్ ఎస్సై లు, ట్రాఫిక్ పోలీసులు,   ఆయా షోరూం యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments