సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెరుకువారిపల్లె గ్రామానికి చెందిన రఫీ (26) అనే యువకుడు మృతి చెందాడు. సదుం నుండి ఇంటికి బైక్‌పై తిరిగి వస్తుండగా, సదుం–నాయనపాకాల మార్గంలోని మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో రఫీ అక్కడికక్కడే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# పుత్తూరు మురళి.






