మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గా ప్రజల చెంతకే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.పెద్ద శంకరంపేట మండలంలో రైతు వేదికలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మండలంలో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికై మండల స్థాయి అధికారులకు పంపించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల దూరాభారాలను తగ్గించి ఎక్కడ సమస్యను అక్కడే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి ప్రజావాణికి హాజరయారు.




