ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ మరియు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసులును బదిలీ చేసి.. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించారు.
మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించింది.
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్.
ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి.
గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా మయూర్ అశోక్.
అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజ.
చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్.
గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబిక.
కడప జేసీగా నిధి మీనా.
విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి.
అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ.
పల్నాడు జేసీగా వి.సంజనా సింహ.
కడప జేసీగా నియమితులైన నిధి మీనా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం.




