Home South Zone Telangana సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 2.58కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ భార్య.|

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 2.58కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ భార్య.|

0

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుండి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు.

తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిళ వాట్సప్‌కు మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు.
స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరిన ఊర్మిళ.

ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500% లాభాలు వస్తాయని నమ్మించిన దినేష్ సింగ్ అనే వ్యక్తి.
దినేష్ సింగ్ మెసేజ్స్‌ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్‌లో స్క్రీన్ షాట్లు పెట్టిన వాళ్ళ ముఠాలోని సభ్యురాలు ప్రియసఖి.

దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుండి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్లు బదిలీ చేసిన ఊర్మిళ.
ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా.
యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.

సైబర్ నేరగాళ్లు దినేష్ సింగ్ అనే వ్యక్తి పేరుతో అనేక ప్రొఫైల్స్ సృష్టించి మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపిన పోలీసులు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version