Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra PradeshGST, RTGS, పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం సమీక్ష |

GST, RTGS, పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం సమీక్ష |

జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు, అధికారులతో సమీక్షలో దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• గిన్నీస్ వరల్డ్ రికార్డుల గురించి ఎక్కడో వినేవాళ్లం ఇప్పుడు భారత్‌లో, అందులో ఏపీలోనూ నమోదు అవుతున్నాయి
• ఇది సమిష్టి విజయంగా భావిస్తున్నాను. వేగంగా రహదారుల నిర్మాణం దేశ ప్రగతికి కీలకంగా మారుతుంది
• ఏ పనులూ రాత్రికి రాత్రి పూర్తి కావు. అన్ని వ్యవస్థలూ ఇంటిగ్రేట్ కావాలి
• జాతీయ రహదారుల నిర్మాణంలో నితిన్ గడ్కరీ రికార్డులు సృష్టిస్తున్నారు
• అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.

• జీఎస్డీపీ, శాంతి భద్రతలు ఇలా అన్ని రంగాల్లోనూ పనితీరు బేరీజు వేస్తున్నాం
• గత ఏడాది ఏపీ కంటే బాగా చేసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. వాటితో పోటీగా మనం ముందుకు వెళ్లాలి
• నీటి భద్రత సాధించాం. సీజన్ల వారీగా నీటి పంపిణీ జరగాలి. ఇదే తరహాలో ఇతర విభాగాలు కూడా పనిచేయాలి
• ఏ అంశంలో అయినా ప్రభుత్వ శాఖలు ముందస్తుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి
• నెలలవారీ, త్రైమాసికంగా, సంవత్సర ప్రణాళికలు ఉంటేనే లక్ష్యాలను సాధించగలుగుతాం.

• ప్రతీ ప్రభుత్వ శాఖ, జిల్లా కూడా ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే సమయానికి నిర్దేశిత వృద్ధిరేటును సాధించగలగాలి
• యాక్యురెసీ ఆఫ్ డేటాపై కలెక్టర్లు, అధికారులు దృష్టి పెట్టాలి. ఆ సమాచారం ఆధారంగానే జీఎస్డీపీ నేరుగా నమోదు కావాలి
• వచ్చే నెలలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించి జీఎస్డీపీ అంశాలను మరోమారు పరిశీలిస్తాం
• పది సూత్రాల అమలు పర్యవేక్షణకు పది మంది అధికారులను టాస్క్ ఫోర్సుగా ఏర్పాటు చేశాం
• క్షేత్రస్థాయిలో వీటిని సరిగ్గా అమలు చేసేందుకు బాధ్యత తీసుకోవాలి.

• కొన్ని ప్రభుత్వ శాఖలు కేంద్ర నిధుల్ని ఖర్చు చేయటం లేదు. వీటిపై దృష్టి పెట్టండి
• జనవరి 15 లోగా ఖర్చు చేసి యుటిలిటీ సర్ఠిఫికెట్లు సమర్పించండి.
• ఈ నెలాఖరు లోగా వందశాతం నిధులు వ్యయం చేయాల్సిందే.
• మార్చి 15 నాటికల్లా కేంద్ర నిధులు ఖర్చు చేసేసి అదనపు నిధులకు వెళ్లండి
• *డూ ఆర్ డై విధానంలో కేంద్ర నిధుల్ని ఖర్చు చేయాలి.

• జనవరి నెలాఖరు లోగా ఖర్చు పెట్టి మార్చి 15 తర్వాత అదనపు నిధుల కోసం కేంద్రం దగ్గరకు వెళ్దాం
• ఖర్చు చేయకపోతే అది ఆయా విభాగాల వైఫల్యం కిందకే వస్తుంది
• రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి లో ప్రత్యేక సెల్ ఆర్ధిక శాఖలో ఏర్పాటు చేసుకున్నాం
• నిధులు లేవనే కారణంతో ప్రాజెక్టులను నిలిపేయకుండా వాటిని చెపట్టేలా క్రియేటివ్ విధానంలో ఆలోచన చేయండి
• పీపీపీ ద్వారా వేర్వేరు వినూత్న ప్రాజెక్టులు చేపట్టండి
• స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు ఖర్చు చేసేందుకు ఆస్కారం ఉంది
• స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎందుకు నిధులు వ్యయం చేయలేదు. అర్బన్ రూరల్ 440 కోట్లు ఉంటే అంత తక్కువ వ్యయం చేయటం ఏమిటి.

• అదనపు నిధులు కూడా కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు అవకాశం ఉంది.
• తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైబ్రీడ్ మోడల్ లో రహదారులు వేసే అంశంపై ప్రణాళికలు చేయండి
• మంజూరు అయిన ప్రాజెక్టులన్నిటికీ పనులు వేగంగా ప్రారంభం కావాలి
• జిల్లా కలెక్టర్లు అన్ని మేజర్ పారిశ్రామిక ప్రాజెక్టులూ గ్రౌండింగ్ అయ్యేట్టు శ్రద్ధ వహించాలి.
• ప్రతీ ప్రభుత్వ శాఖా పౌరసేవలు అందించటంలో మరింత మెరుగ్గా వ్యవహరించాలి.
• ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. దానిపై అధికారులు శ్రద్ధ పెట్టాలి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments