కర్నూలు: నంద్యాల : డోన్
ఈ రోజు డోన్ పట్టణంలోని క్లబ్ హౌస్ ప్రాంగణంలో డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ గారి సహకారంతో,బసవతారక్ ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ (స్క్రీనింగ్) శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.ప్రజారోగ్య పరిరక్షణలో బసవతారక్ ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.




