AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు.
మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలన్నారు. ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




