Home South Zone Andhra Pradesh దోమ కాటుతో జ్వరం నివారణ లక్ష్యం |

దోమ కాటుతో జ్వరం నివారణ లక్ష్యం |

0

దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం…బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరియు డి ఎం హెచ్ ఓ గారి ఆదేశాల మేరకు కీటక జనిత వ్యాధుల నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దోమ కాటు వల్ల ఏ ఒక్కరికి కూడా జ్వరం రాకూడదన్నది తమ ధ్యేయమని బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు అన్నారు.

ఈరోజు వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రభుత్వ బదిరుల హాస్టల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మలాథియాన్ ఫోకల్ స్ప్రేయిoగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ మరియు వెల్ఫేర్ హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఇండోర్ రేసిడ్యుల్ స్ప్రే ద్వారా మలేరియా డెంగ్యూ బోదకాలు తదితర వ్యాధులను కలుగజేసే దోమలు పూర్తిగా చనిపోతాయని.

కీటక జనిత వ్యాధులను నిర్మూలన అనుకున్న లక్ష్యంగా చేరువవడంలో ఈ కార్యక్రమం చాలా ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడా పరిసరాలలో అనవసరపు నీటి నిల్వలు మరియు మురుగునీరు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా మురుగునీరు నిల్వ  ఉన్న మరియు దోమ లార్వా పెరుగుదల ప్రదేశాలు ఉన్నా సంబంధిత ఆరోగ్య శాఖ కార్యకర్తలకు తెలియజేయాలని వారు పంచాయితీ సిబ్బంది సహకారంతో మురుగునీటిని తొలగించి దోమలను నిర్మూలించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు.

కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి షకీల్, హెచ్ ఓ దిడ్ల ప్రసాదు సూపర్వైజర్ రవిశంకర్ హెల్త్ అసిస్టెంట్ చంద్రమోహన్ పాల్గొన్నారు  పాల్గొన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version