Home South Zone Telangana యువత క్రీడాల్లో రాణించాలి |

యువత క్రీడాల్లో రాణించాలి |

0

యువత క్రీడాల్లో రాణించాలి

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ముదిరాజ్ యువతకు ప్రోత్సాహం

భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామంలో నిన్న తేది 12.01.2026 నాడు టీఎంపీస్ కోడంగల్ నియోజకవర్గం ఇంచార్జి దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాటూర్ కోట్ల హన్మంతు ప్రోత్సాహంతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేసారు అలాగే ఈనెల 14వ తేది నుండి 16 వ తేది వరకు దేశాయిపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేయనున్నారు.

ఈ సందర్బంగా కోట్ల హన్మంతు మాట్లాడుతూ విద్యార్థులు,యువత విద్యతో పాటు ఆట పాటల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు యువతకు ఎంతో ప్రయోజనం ఉంటుంది అని విద్యార్థులకు యువత శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని క్రిడల్లో పాల్గొనడం వల్ల వారికి నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు,ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శారీరక ఆరోగ్యం దృఢత్వం పెరుగుతుంది,బరువు నియంత్రణలో ఉంటుంది, శారీరక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది అని మానసిక ఆరోగ్యం ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,
నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి,సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి అని అన్నారు.విద్యార్థులు యువత క్రీడల్లో రాణించడం వల్ల ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అని ఎల్లప్పుడూ యువతకు సహాయం అందిచడంలో నేను వెన్నంటూ ఉంటాను అని తెలిపారు.

#సూర్యమోహన్

NO COMMENTS

Exit mobile version