నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
సారు మా పై దయాచూపండి
భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-
వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకింపేట్,పోలేపల్లి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రైతుల నుండి భూసేకరణ చేపట్టారు రైతులకు నష్ట పరిహారం కూడా అందించడం జరిగింది.కానీ హకింపేట్ గ్రామానికి చెందిన సామల బుగ్గప్ప తండ్రి సామల బాలయ్య అనే రైతుకు హకింపేట్ గ్రామంలో సర్వే నెంబర్ 252/8 లో 3.00 ఎకరాల భూమి కలదు ఇట్టి భూమిని రైతు సామల బుగ్గప్ప
ప్రభుత్వనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఫైల్ నెంబర్ G/2487/2024,తాండూర్ సబ్ కలెక్టర్ ఫైల్ నెంబర్ B/7450/2024,గెజిట్ నెంబర్ 16-వికారాబాద్ తేది 29.11.2024,నోటిఫికేషన్ ఫారం-సి ప్రకారం క్రమసంఖ్య-214 ప్రకారం అప్పచెప్పినారు.అయినను సామల బుగ్గప్ప అనే రైతుకు నేటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం అందలేదు కావున నిన్న తేది 12.01.2026 నాడు రైతు దుద్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు తమకు న్యాయం చేయాలి అని బ్యానర్ కట్టి వికారాబాద్ జిల్లా కలెక్టర్ తాండూర్ ఆర్డివో దుద్యాల తహసీల్దార్ స్పందించి నష్ట పరిహారం అందేలా న్యాయం చేయాలి అని వినూత్న నిరసన తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అని వేచి చూడాలి మరి
#సూర్యమోహన్




