విజయవాడ నగరపాలక సంస్థ
ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి
ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 12 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 2, ఇంజనీరింగ్ 4, పబ్లిక్ హెల్త్ 2, యుసిడి 3, ఎస్టాబ్లిష్మెంట్ 1 మొత్తం కలిపి 12 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి.
పౌర సంబంధాలు అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ




