మహాసేయులకు విజ్ఞప్తి’ సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది. హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషిక, దర్శకుడు కిశోర్ తిరుమల స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. సినిమా విడుదల సందర్భంగా కాణిపాకం వచ్చినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.




