సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన
బాపట్ల: బాపట్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోమవారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న క్రమంలో తీర ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిని వారు నిశితంగా పర్యవేక్షించారు.
కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రూ. 97 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో బీచ్ పరిసరాలను పర్యాటక స్వర్గధామంగా మార్చే పనులు వేగవంతం అయ్యాయి. సూర్యలంకను కేవలం విహార కేంద్రంగానే కాకుండా, బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలతో కూడిన గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
తీర ప్రాంత పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు
#Narendra




