రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. పేద బ్రాహ్మణుల సంక్షేమం, వారికి అండగా నిలిచేందుకు ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే.
సంబంధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నారు. వీటికి నేరుగా అకౌంట్లో జమ చేయనున్నారు. కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే గరుడ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా మొదలైంది. తాజాగా అమరావతిలోని సచివాలయంలో ఈ పథకం విధివిధానాలు, అమలుపై మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ సమావేశమై చర్చించారు. పథకం ఎలా అమలు చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.






