గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాట్లు గొడిసెర్యాల గోండు గూడెం (జీ) సర్పంచ్ మెస్రం సురేందర్ అన్నారు.
మండలంలోని గొడిసెర్యాల గోండు గూడెం (జీ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
సమస్యలపై, అభివృద్ధి పనులపై చర్చించి తీర్మానం చేశారు. ఉప సర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి గంగాదేవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.




