విజయవాడ నగరపాలక సంస్థ
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్ధతిలో కోచులగా పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరణ
విజయవాడ నగర పాలక సంస్థ పరధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్దతిన నెలకు రూ. 15,000/- గౌరవేతనము పై జిమ్ కోచ్ (2) పోస్టులు మరియు రూ. 25,000/- గౌరవేతనముపై అథ్లెటిక్ మరియు ఫిజియోథెరపి కోచ్ (1) పోస్టు లో పనిచేయుటకు గాను అర్హతలు కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు .
జిమ్ కోచ్ కొరకు అర్హతలు
1. కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్
2. వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు
3. సంబంధిత పోస్టులో కనీసం 3 సంవత్సరాల అనుభవం
4. బాడీ బిల్డింగ్‌లో జాతీయ / రాష్ట్ర / జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనడం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
*అథ్లెటిక్ & ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు అర్హతలు:*
1. కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్
2. వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు
3. అథ్లెటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కోచింగ్
4. సంబంధిత పోస్టులో ఎన్ఐఎస్ (NIS) సర్టిఫికెట్లు కలిగి ఉండాలి
5. అథ్లెటిక్స్‌లో జాతీయ / రాష్ట్ర / జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనడం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
కావున పై తెలుపబడిన అర్హతలు కలిగిన అభ్యర్ధులు అన్ని వివరములతో కూడిన తమ బయోడేటాను తగు సర్టిఫికెట్లతో జతపరచి దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియము, బందర్ రోడ్డు నందుగల స్పోర్ట్స్ విభాగము నందు తేది.19-01-2026 (సోమవారం) సాయంత్రం 05.00 గం.లోపు అందచేయవలసినదిగా తెలిపారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ




