Home South Zone Andhra Pradesh స్వామి వివేకానందకు ఘన నివాళులు |

స్వామి వివేకానందకు ఘన నివాళులు |

0
0

స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.

చీరాల: స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.

స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12 నాడు కోల్ కత్తాలో జన్మించి. కేవలం 39 సంవత్సరాల ఆరు నెలలు జీవించారు. అంతతక్కువ వయోపరిమితిలో కూడా అనితర సాధ్యమైన పనులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఒక అద్వైత వేదాంతి తొలిసారిగా పాశ్చాత్య దేశాలను పర్యటించడం… ప్రపంచానికి అంతటికీ భారతీయుల ఔన్నత్యాన్ని చాటిచెప్పడం అనేవి స్వామి వివేకానందలోనే చూడగలం. స్వామి శిష్యులలో పాశ్చాత్యులు సైతం భారతదేశానికి ఎంతో సేవచేశారు.

స్వామి వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. యుక్తవయస్సులోనే భారతీయ కీర్తిపతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన మహనీయుడు. యువజనులలో స్ఫూర్తి నింపితే వారే దేశానికి వెలుగునిస్తారని నమ్మిన మానవతావాది. నేటికీ యువతరం హృదయాలలో ఆయన వ్యక్తిత్వం మహోన్నతంగా ప్రకాశిస్తూనే ఉంది. వివేకానందుల జయంతి సందర్భంగా ఆయన సందేశాలు జ్ఞాపకం చేసుకొని ఆచరిద్దాం. ‘దేవుడు మానవుణ్ణి తన పోలికలతో సృష్టించాడు’ అనే మాట తప్పు. మానవుడే దేవుణ్ణి తన పోలికలతో సృష్టించుకున్నాడు అనడం ఒప్పు. విశ్వమంతటా మనం మనకు ప్రతిరూపాలుగా దేవుళ్లను సృష్టించుకుంటున్నాం అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన అద్వైత వేదాంత ప్రబోధకమైన ఈ ప్రసంగం చదివితే యువజనుల్లో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్ధమవుతుంది.

యువతను జాగృతం చేసిన స్వామీ వివేకానంద గారి ఆలోచనలు, ఆదర్శాలు నేటికీ దేశ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వారు చూపిన విలువల బాటలో నడుచుకుంటూ, దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తూ, మరింత బలంగా ముందుకు సాగాలి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు వేణు పిక్కి నారాయణ గుమ్మ వెంకటేష్ బోయిన శీను మంగపతి మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ హోటల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు

#Narendra

NO COMMENTS