గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ బృందం పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించి, మూడు పీడీఎస్ రైస్ వాహనాలను స్వాధీనం చేసుకుంది.
1) ఈ రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు గ్రామపంచాయతీ – భారత్ పెట్రోల్ బంక్ వద్ద నెంబర్ లేని టాటా విన్ట్రా వాహనంలో పీడీఎస్ రైస్ బ్యాగులు నింపి పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం అందింది.ఆ సమాచారం మేరకు పెట్రోల్ బంక్ లో నిలిపి ఉన్న AP39 TZ 5164 (TATA VINTRA) అనే వాహనాన్ని (వాహనం వద్ద ఎవరూ లేరు) తనిఖీ నిర్వహించి, అందులోని మొత్తం 2.5 టన్నులు (50 కేజీలవి, 50 బస్తాలు) బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
2)నిన్న రాత్రి 10:30 గంటలకు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట 5/18 లైన్ వద్ద పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతోందని టాస్క్ ఫోర్స్ బృందానికి సమాచారం అందింది.
ఆ సమాచారాన్ని SB CI గారికి తెలియపరచి, టాస్క్ ఫోర్స్ CI గారి ఆదేశాల మేరకు రైడ్ నిర్వహించి AP39 WA 9402 (VINTRA Vehicle) అనే వాహనాన్ని, వాహన డ్రైవర్ పాలేటి.నాగరాజును అదుపులోకి తీసుకుని, వాహనంలో ఉన్న మొత్తం 3.5 టన్నులు(50 కేజీలవి, 70 బస్తాలు) స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని గుంటూరు జిల్లా పోలీస్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
