ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు ఇతర ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అన్ని జిల్లాల FAలు ఇవ్వాల్సిందిగా కోరడమైనది…
ప్రధానమైన డిమాండ్స్:
1. దేశం లో ఒకే విధంగా GRS గా ఉన్న వ్యవస్థను అంధ్రప్రదేశ్ లో కూడా GRS సహాయకులు కొనసాగిస్తూ మమ్మల్ని గుర్తిస్తారని కోరుచున్నాము.
2. FTE ఉద్యోగులుగా అందరిని కూడా గుర్తించి తగు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచూ FTE ని పూర్తిస్థాయిలో అమలు చేయవలసినదిగా కోరుచున్నాము.
3. మండల స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీకి బదిలీ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు గ్రామ స్థాయిలో కలిగె రాజకీయ వత్తిడులు కారణంగా మాకు బదిలీ సౌకర్యం కల్పించాలని సవినయముగా కోరుచున్నాము.
4. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా మా యొక్క జీతభత్యాలు కనీసం వేతనం 29,000 వచ్చే విధముగా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మాకు కేటాయించిన 1/3 పూర్తి స్థాయిలో మాకు చెందేటట్టుగా మాకు న్యాయం చేస్తారని సవినయంగా కోరుచున్నాము.
5. గ్రాడ్యుటీ మరియు హెల్త్ కార్డులు నగదు రహిత వైద్య సేవలు ప్రమాద బీమాను పెంచి(10లక్షలు వరకు), వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకములు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల సత్యవేణి,సుర్ల గోవిందురాజులు (గాంధీ)సహాయకార్యదర్శులు:కట్టా నాగరాజు, తాలుం మాణిక్యలరావు (నాని)కోశాధికారి:అడబాల శ్రీను, సహాయ కోశాధికారి: గుత్తుల గోపి, ప్రచార కార్యదర్శులు:గొల్లపల్లి ప్రదీప్ కుమార్, నిమ్మగంటి శ్రీనివాస్ వి. వెంకటేశ్వరరావు.
మహిళా విభాగం:అధ్యక్షులు : చల్లా ఉషా, ఉప అధ్యక్షులు : సబ్బరవు అనిత, కార్యవర్గ సభ్యులు:కె. నూకరాజు (గొల్లప్రోలు),కె. నారాయణరావు (పెదపూడి), యమ్. రాజేష్ (గండేవల్లి), యమ్. సత్యనారాయణ(ప్రత్తిపాడు), డి. నాగసుబ్రహ్మణ్యం (పిఠాపురం), కె. గోవిందు (జగ్గంపేట), కె. శివాజీ (ఏలేశ్వరం),కె. సుబ్రహ్మణ్యం.
(ప్రత్తిపాడు),కె.సూర్య (గొల్లప్రోలు), గణేష్ (సామర్లకోట), యన్. రాధకృష్ణ (కాజాలూరు),యమ్. నూరిబాబు,(కిర్లంపూడి),జి. వీర్రాజు (పెద్దాపురం), యమ్.ముసలయ్య(రౌతులపూడి), ఈ. శివబాబు (కోటనందూరు), బి.శ్రీను (తొండంగి), పి. కిరణ్ (తాళ్లరేవు), జె. సతీష్ కుమార్ (పెదపూడి)క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం పాల్గొన్నారు…
#Dadala Babji






