ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట…! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయంట…!!
విగ్రహాల నిర్మాణానికి పెట్టే ఖర్చును వైద్య కళాశాలలకు పెట్టండి.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మంచి విధానం అంటున్న నారా లోకేష్…! మరైతే కన్వీనర్ కోటాను కొనసాగిస్తారా…?
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను నడిపేదేమో కార్పొరేట్లు…!
జీతాలు చెల్లించేదేమో ప్రభుత్వం….!!
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 107 108 రద్దు చేస్తానన్న నారా లోకేష్ ఇప్పుడు ఏకంగా కళాశాలనే అమ్మేస్తున్నారు.
Eswaraiah Gujjula సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలలో పదింటిని పబ్లిక్ _ప్రైవేట్_
భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలను 1 ఎకరంను 100 రూపాయలకు 33 సంవత్సరాల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50 శాతం తగ్గించడం, 50 శాతం సీట్లను మార్కెట్ రేట్లతో అమ్మడం వంటి నిర్ణయాల వల్ల ఫీజులు కూడా అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పేద మరియు మెరిట్ విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది.
గత ప్రభుత్వం నాబార్డ్ నిధులతో 8500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. అందులో ఐదు కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అయితే జీవో 107, 108 ద్వారా సెల్ఫ్-ఫైనాన్స్ కోటాను ప్రవేశపెట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధానాలు చేపట్టింది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ లక్షల మంది విద్యార్థి, యువతను సమీకరించి ఈ జీవోలను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేసి, 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను తుంగలో తొక్కి, ప్రజాధనంతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను పిపిపి పేరిట ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించేందుకు పూనుకుంది. గత ప్రభుత్వం కేవలం సీట్లు అమ్మింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ భూములనే కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తుంది. దీని వల్ల ప్రభుత్వ కళాశాలలో కేవలం 5 లక్షలతో పూర్తయ్యే కోర్సుకు రూ॥ 27.5- 110 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి 1754 రూపాయల కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం నిర్మించడం మేము తప్పు పట్టట్లేదు కానీ ప్రజాధనాన్ని ఉపయోగించడం సరికాదు. ఎన్టీఆర్ గారి అభిమానులు , శ్రేయోభిలాషులు మరియు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ,ఎంపీలు దగ్గర నుంచి నిధి వసూలు చేసి నిర్మిస్తే బాగుంటుంది.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ఒకపక్క విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పడం సిగ్గుచేటు.
ప్రభుత్వ నిధిని ప్రజాభివృద్ధికి ఉపయోగించాలి . ప్రతి గ్రామంలో గుడి ఉన్నా లేకపోయినా బడి ఉండాలి ఆ బడి నుంచి విద్యార్థులు విజ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చిన్న తప్ప విగ్రహాలతో కాదు. విగ్రహాలకు పెట్టే ఖర్చు ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు పెట్టాలి.నేటి బాలలే రేపటి పౌరుల అన్న నాయకులకు, దేశ భవిష్యత్ తరగతి గదిలోనే మొదలౌతుంది అన్న నాయకుల మాటలు నేడు కేంద్ర BJP ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి దేశ అభివృద్ధి తరగతి గదిలో కాకుండా విగ్రహాల ప్రతిష్టలో ఉన్నట్టు ఉంది. అందుకే అభివృద్ధి కోసం కాకుండా ఆదాయం కోసం గత ప్రభుత్వం పేద,మధ్యతరగతి వైద్య విద్యార్థుల కోసం నిర్మించిన వైద్య కళాశాలను పిపిపి పేరుతో ప్రవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు.
ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య సేవలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనా ఆసుపత్రులు అధిక ఫీజులు, ఖరీదైన చికిత్సలు మాత్రమే అందించే కేంద్రాలుగా మారిపోతాయి. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు పూర్తిస్థాయి వైద్య సేవలు పొందలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇదే కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ఓపి, ఐపి, రోగ నిర్ధారణ, రక్త పరీక్షలు, అవయవ మార్పిడి వంటి పెద్ద శస్త్రచికిత్సలు సైతం పేదలకు పూర్తిగా ఉచితంగా అందేవి. కానీ పిపిపి పద్ధతిలో ప్రైవేటు అప్పగించడం వలన ఇన్‌పేషెంట్ సేవల నుండి మందు బిళ్లల వరకు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే అవకాశం యాజమాన్యానికి లభిస్తుంది.
అసలు పిపిపి అంటే పబ్లిక్ ప్రాపర్టీపై ప్రైవేట్ పెత్తనం. ఉదాహరణకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టాలంటే భూమి కావాలి, భవనాలుండాలి, స్టాఫ్ ఉండాలి, ఎక్విప్మెంట్ కావాలి, అన్నింటికీ మించి ఎన్ఎంసి అనుమతులుండాలి. అందుకు వందల కోట్లు వెచ్చించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే భవనాలు నిర్మించి ప్రజాధనంతో సకల ఏర్పాట్లు చేసిప్రభుత్వమే సర్వం సిద్ధం చేసిన తర్వాత నిర్వహణ ప్రైవేటు వాళ్లకి ఇస్తోంది. అంటే మొక్కను పెంచి కాయలు కాసిన తర్వాత కోసుకుని తినే హక్కు వేరొకరికి అప్పగిస్తోంది.
పిపిపి అంటే ప్రైవేటీకరణ కాదని ప్రభుత్వ యాజమాన్యమే ఉంటుందని పాలకులు సన్నాయి నొక్కులు నొకుతున్నా… వాస్తవం వేరేలా ఉంది. ఏదైనా ఓ సంస్థలో ప్రైవేటు అడుగుపెట్టిందంటే క్రమంగా కాజేయడమే తప్ప ప్రభుత్వ రంగాన్ని ఉద్దరిస్తుందనుకోవడం అవివేకం. ప్రైవేటు సంస్థలకు లాభాలు కావాలి. లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి విద్యార్థుల ఫీజులు, రెండోది రోగుల ఛార్జీలు, ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు నామమాత్రపు ఫీజుకి దొరికే సీటు పిపిపిలో అనేక రెట్లు పెరుగుతుంది. ప్రభుత్వం అందించే ఉచిత విద్య కూడా చాలా ఖరీదు కాక తప్పదు. ఇప్పటికే ప్రైవేటు అడుగుపెట్టిన అన్ని చోట్లా జరిగింది ఇదే. ఇప్పుడు వైద్యంలోనూ జరగబోయేది ఇదే.
దేశంలో టాప్ గా నిలిచిన మెడికల్‌లో ఎయిమ్స్, ఇంజినీరింగ్‌లో లో ఐఐటీ, మేనెజ్మెంట్లో ఐఐఎమ్, లా కోర్సులో నల్సార్, ఫార్మసీలో జామియా, వ్యవసాయంలో ఐఏఆర్- ఇవన్నీ ప్రభుత్వ విద్యాసంస్థలే! వీటిల్లో ప్రైవేటు సంస్థ ఒక్కటైనా ఎందుకు లేదు? గవర్నమెంట్ క్యాంపస్‌లో సీటు దక్కని వారు మాత్రమే ప్రైవేటుకి ఎందుకు వెళ్తున్నారు? ప్రైవేటీకరణ నిజంగా విద్యను మెరుగుపరుస్తుందా లేక పేద, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తును మార్కెట్‌కి బలి చేస్తోందా? వీటికి సమాధానం చెబితే కూటమి నేతల పిపిపి పన్నాగం అసలు రూపం బయటపడుతుంది. ప్రైవేటికి ఇస్తే ఏదో ఉద్దరిస్తారని చెబుతున్న మాటల డొల్లతనం వెల్లడవుతుంది.
ఈ పిపిపి మోడల్ విస్తరిస్తే అన్ని ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పిపిపి అంటూ ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. ఏ దేశంలోనైనా ప్రజలకి ఉత్తమ వైద్య సేవ లందించాలంటే, ప్రభుత్వమే వైద్యాన్ని, వైద్య విద్యను అందించాలి.
కానీ ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులైన విద్యా, వైద్య రంగాలను కళ్ళ ముందు కాజేస్తుంటే, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుంటే ఆ చర్యలను ప్రతిఘటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పేదలకు ఉచిత విద్య వైద్యం ఉపాధి హామీలు కల్పించాలని విద్యార్థి, యువత పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తుంది.
వైద్య కళాశాలల పిపిపి నిర్ణయాన్ని తక్షణమే
ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది. యువగళం పాదయాత్రలో జీవో నెం. 107, 108ను రద్దు చేసి 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోరని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈనెల 14వ తారీకున రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి ,యువత మరియు CPI నాయకులు, కార్యకర్తలు భోగి పండుగ సందర్భంగా భోగిమంటల్లో జీవో నెంబర్ :590 , 847లను దగ్నం చేసి నిరసన వ్యక్తం చేయాలని సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.
ప్రతి ఒక్కరికి ఉచిత విద్యా , వైద్యం కల్పించే అంతవరకు మన పోరాటం ఆగదు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిరక్షించేందుకు మనమందరం కలిసి పోరాడుదాం.
గుజ్జుల ఈశ్వరయ్య,
సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి,
+919849575343




