Thursday, January 15, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగంపలగూడెం రహదారులకు మహర్దశ

గంపలగూడెం రహదారులకు మహర్దశ

గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*

పల్లెలలో రహదారుల అభివృద్ధికి కూట‌మి ప్రాధాన్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్*

గంప‌ల‌గూడెంలో సీసీ రోడ్ల నిర్మాణ ప‌నుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శంకుస్థాప‌న*

గంప‌ల‌గూడెం మండ‌లం : పల్లెపండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం, గంప‌ల గూడెం మండ‌లం గంప‌ల గూడెం పంచాయ‌తీలో రామ్మోహ‌న్ ధియేట‌ర్ ఎదురుగా వున్న ఎస్సీ, బిసీ కాలనీల‌కు మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ ప‌థ‌కం కింద రూ.41 ల‌క్ష‌ల అంచ‌నా విలువ‌తో నిర్మించనున్న అంత‌ర్గ‌త సిమెంట్ రోడ్ల ప‌నుల‌కు బుధ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ శంకుస్థాప‌న చేశారు.

గంప‌ల‌గూడెంలో రోడ్ల శంకుస్థాప‌నకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్య‌క్షుడు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు, గంప‌ల‌గూడెం మండ‌లం తెలుగుదేశంపార్టీ అధ్య‌క్షుడు మానికొండ రామ‌కృష్ణ (ఎమ్.ఆర్.కె) స్థానిక ఎన్డీయే కూటమి నాయ‌కుల‌తో క‌లిసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, మరోవైపు పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎయంసీ చైర్ పర్సన్ రేగళ్ళ లక్ష్మి అనిత వీరారెడ్డి, సర్పంచ్ కోట పుల్లమ్మ , స్థానిక ఎన్డీయే కూట‌మి నాయ‌కులు కాజా రవికుమార్ , సత్యంబాబు, కావూరి బాబు, గువ్వల వెంకటేశ్వర రెడ్డి, యసారపు ముత్యాలరావు, కోట వెంకటేశ్వరరావు, వేముల బాలయ్య, నల్లగట్ల రాఘవమ్మ, ఎంపీడీవో సరస్వతి ల‌తో పాటు కూటమి నేతలు, పంచాయతీ రాజ్ డిఈ, ఎఈ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments