రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రతినిధులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.*






