విజయవాడ నగరాభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)*
*ఎంపీ కార్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు…*
*ఎన్డీయే కూటమి నాయకులు, కుటుంబ సభ్యులతో భోగి మంటలు వెలిగించిన ఎంపి కేశినేని శివనాథ్*
*భోగిమంటల్లో జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల ప్రతుల దగ్ధం*
*ముఖ్యఅతిథిగా టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ హాజరు*
*ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్*
*సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజలు
విజయవాడ : గత ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ అన్ని విధాలా అభివృద్ధి చేయటం జరుగుతోంది.. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంక్రాంతి శోభతో ఎంపీ కార్యాలయం కళకళలాడగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. .
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించి, సతీమణి కేశినేని జానకీ లక్ష్మీ, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్ధ, ఎన్డీయే కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి వేడుకల ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తో కలిసి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఆవరణ లోఓ నిర్వహించిన భోగి వేడుకల్లో ఎంపి కేశినేని శివనాథ్ , సతీమణి కేశినేని జానకి లక్ష్మీ, ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ,, యువ నాయకుడు గద్దె క్రాంతి, ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి పాల్గొని భోగి మంటలు వెలిగించి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటల్లో ఎంపీ కేశినేని శివనాథ్ గత వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా, జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల ప్రతులను వేసి దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలను ఇప్పుడు అదే పార్టీ నేతలే భోగి మంటల్లో వేసి కాలుస్తున్నారని ఎద్దేవా చేశారు.. మెడికల్ కళాశాలలకు సంబంధించిన జీవోలు కూడా వైసీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ ముద్రించారని విమర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ , కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బొమ్మలను తొలగించి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో పాటు, నగర మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు బొప్పన భవ కుమార్, జంపాల సీతారామయ్య, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు చలసాని రమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళిత రత్న) ,
ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గన్నే ప్రసాద్ (అన్న), చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ , అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణ రావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా.
ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో-ఆర్డినేటర్ జి.వి.నరసింహారావు, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు నసీమా, విజయవాడ కనకదుర్గ ఆలయ బోర్డ్ సభ్యురాలు సుఖాసి సరిత, క్లస్టర్ ఇన్చార్జులు సుబ్బారెడ్డి.
, యేదుపాటిరామయ్య, పశ్చిమ నియోకవర్గ డివిజన్ అధ్యక్షుడు సుబ్బయ్య, రాంబాబు, అజీజ్, ఐలా మాజీ ప్రెసిడెంట్ సుంకర ప్రసాద్, టిడిపి నాయకులు గుమ్మడి కృష్ణ, ఎర్నేని వేద వ్యాస్, కోడూరు ఆంజనేయ వాసు, మాదిగాని గురునాధం,సంకె విశ్వనాథం, పీతా బుజ్జి, గొర్తి శ్రీనివాస చక్రవర్తి ఇత్తడి చార్లెస్, కాకు మల్లికార్జున యాదవ్, అబిద్ హుస్సేన్, పామర్తి కిషోర్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




