Home South Zone Andhra Pradesh పుంగనూరు మండలంలో జీవో 188 అమలు కమిటీ |

పుంగనూరు మండలంలో జీవో 188 అమలు కమిటీ |

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మార్వో రాముతో కలిసి మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఎ. అప్పాజీ తెలిపారు.

ఈ కమిటీలో డిప్యూటీ ఎంపీడీవో సుధాకర్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్, పీఆర్ ఏఈ ఆనంద్, ఏఎస్ఐ అశ్వత్త, ఏపీవో శివశంకర్ సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ఏర్పాటుతో పాటు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు అవుతాయని ఎంపీడీవో వెల్లడించారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version